SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా వార్షిక తనిఖీల్లో భాగంగా సత్తెనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసు ను తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, IPS ఈ తనిఖీలలో భాగంగా సబ్ డివిజన్ ఆఫీసు పరిసరాలను, భవనమును పరిశీలించినారు.గంజాయి రవాణా మరియు వినియోగం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి కట్టడికి చర్యలు తీసుకోవాలన ” CYBER AWARE” కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలపై అన్ని విద్యా సంస్థలలో, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించడం జరిగింది.జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యచరణ తో ముందకు సాగాలని, బ్లాక్ స్పాట్స్ గుర్తించడం, స్టాపర్స్ ఏర్పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం తదితర కార్యక్రమాలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.సబ్ డివిజన్ ఆఫీసు కు సంబందించిన వివిధ రికార్డులను పరిశీలించి డీఎస్పీ కి పలు సూచనలు చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ,ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ఫిర్యాదుల ను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.సబ్ డివిజన్ ఆఫీస్ సందర్శించిన సమయంలో ఎస్పీ తో పాటు సత్తెనపల్లి డి.ఎస్.పి M.హనుమంతరావు , సత్తెనపల్లి టౌన్ మరియు రూరల్ సీఐలు,ఎస్బి సీఐ -2 శరత్ బాబు పాల్గొన్నారు*

WhatsApp Image 2024 12 19 at 8.07.37 PM

SAKSHITHA NEWS