SAKSHITHA NEWS

ప్రజాకోర్టులో చంద్రబాబు గారిదే విజయం : ఎరిక్షన్ బాబు

యర్రగొండపాలెంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎస్టీ (సుగాలి) సామాజిక వర్గం నాయకుల నిరాహార దీక్షలు

టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎస్టీ (సుగాలి) సామాజిక వర్గం నాయకుల ఆధ్వర్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ నందు బాబు కోసం నేను సైతం అంటూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ… ప్రజా కోర్టులో చంద్రబాబు గారిదే విజయం అని, కడిగిన ఆణిముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని తెలిపారు.

కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్టీ (సుగాలి) సామాజిక వర్గం నాయకులు, టిడిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS