విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 31వ డివిజన్ ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ ప్రాంతంలో జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో
సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్యే . వెలంపల్లి. శ్రీనివాస్ , వైయస్సార్సీపీ నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో కలిసి పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)
31 వ డివిజన్ ప్రజలు అడుగడుగునా హరతులతో ఘన స్వాగతం పలికి, వైస్సార్సీపీ నాయకులకు బ్రహ్మరధం పట్టారు. కేశినేని నాని,వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతీ గడపకు వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలును ప్రజల్లోకి తీసుకువెళ్లారు
ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ…
31 వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమంలో ప్రజలనుండి అనూహ్య స్పందన – జనం గుండెల్లో జగన్ కట్టుకున్న అభిమానం చూసాం
ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు
మంచి చేసిన జగన్ మోహన్ రెడ్డి ని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారన్నారు
మేనిఫెస్టోను ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీతల భావించి వాటిని 99% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ది
బొండా ఉమ పెద్ద బ్లాక్ మెయిలర్,లాండ్ గ్రాబర్, కిడ్నాపర్,ఒక రౌడీ,ఒక గూండా అని విమర్శించారు. స్వతంత్ర సమరయోధుల భూముల ఆక్రమించిన బొండ ప్రజా జీవితానికి పనికి రాడు
వందల కోట్ల ప్యాలెస్ లలో ఉంటున్న రామోజీకి,జూబ్లీహిల్స్ బంగ్లాలో ఉంటున్న రాధాకృష్ణకు ఏపీలో అభివృద్ధి ఎలా కనిపిస్తుందన్నారు.
జగన్ గారి పాలనలో అభివృద్ధి లేదు అనేవారికి కళ్ళు కనిపించట్లేదా అని ప్రశ్నించారు.
8500కోట్లతో 15 మెడికల్ కాలేజీలు కడుతున్నారన్నారు
పేదవాడు సంతోషంతో, ఆరోగ్యంగా ఉండడమే అసలైన అభివృద్ధి అని తెలిపారు.
జగనన్న పాలనలో పేదల పిల్లలు ప్రపంచంతో పోటీ పడుతున్నారన్నారు.
రాష్ట్రానికి చీడ పురుగు చంద్రబాబే అని అన్నారు.చంద్రబాబు డబ్బు తీసుకుని టికెట్లు ప్రకటిస్తున్నాడన్నారు.
స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే మొదటి లిస్ట్, నార్మల్ ప్యాకేజి ఇస్తే రెండోలిస్ట్ అలా వదులుతున్నారన్నారు.డబ్బు ఇవ్వకపోతే టికెట్లు ఇవ్వట్లేదన్నారు.
ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ
బోండా ఉమ ఎన్నో దుర్మార్గలు చేసాడన్నారు.భూ దందాలు చేసే వ్యక్తి తమకు వద్దని సెంట్రల్ ప్రజలు చెప్తున్నారన్నారు.
కేశినేని నానీ వైసీపీలోకి రావడం శుభ పరిణామం అని అన్నారు.
చంద్రబాబు కృష్ణలంక కరకట్ట వాసుల కష్టాలు తీర్చే ప్రయత్నమే చేయలేదన్నారు.
జగన్ గారిని ముఖ్యమంత్రి కానివ్వను ఇది నా శాసనం అని పవన్ 2019లోనే అనలేదా అని ప్రశ్నించారు.
పవన్ పేపర్ మీద రాసుకొచ్చినవి చెప్తే ప్రజలు నమ్మరన్నారు.పవన్ కు గాయత్రి మంత్రం చెప్పడం కూడా రాదన్నారు.
ఇక్కడ నాని ఎంపీ గా నేను ఎమ్మెల్యే గా గెలవడం పక్క అని తెలియచేసారు.
ప్రజలు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి ని ముఖ్యమంత్రిని చేయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా , ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పునూరి గౌతమ్ రెడ్డి ,దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కర్నాటి రాంబాబు , వెలంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి గారు ,మాచవరం ఆంజనేయస్వామి గుడి ట్రస్ట్ డైరెక్టర్ పోలుకొండ శ్రీనివాసరావు , మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ రావు , అమానుల్లా గారు, వెలగలేటి. భార్గవ్ రాయుడు,సెంట్రల్ మహిళ ఇంచార్జ్ తోపుల వరలక్ష్మి,త్రివేణి రెడ్డి,గొల్లభామ, నజీమా బేగం, లత, షేక్ మస్తాన్ వలి, బచ్చు రమేష్, కాలే వెంకట రమణ, కో-ఆప్షన్ మెంబెర్ గుడే సుందర్ పాల్, ఘని, మహేష్, పెద్దిరెడ్డి వెంకట శివారెడ్డి, తదితర కార్పొరేటర్లు,డివిజన్ పార్టీ నాయకులూ కార్యకర్తలు,సచివాలయం కన్వీనర్లు,మండల పార్టీ అధ్యక్షులు,జేసీఎస్ ఇంచార్జులు పార్టీ నాయకులు వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు డైరెక్టర్లు పార్టీ గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.