SAKSHITHA NEWS

నరేంద్ర వర్మ ని అభినందించిన చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని బాపట్ల నియోజకవర్గంలో విస్తృతంగా చేపడుతూ పార్టీ పటిష్ఠతకు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ కృషి చేస్తున్న తీరు అభినందనీయం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందించారు..శుక్రవారం మంగళగిరి సీకే కన్వెన్షన్ నందు జరిగిన పార్టీ జోనల్ 3 సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో బాదుడే బాదుడు సభ్యత్వ నమెదు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమ నిర్వహణలో బాపట్ల నియోజకవర్గం రెండో స్థానంలో నిలిచింది అని తెలిపారు.

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ..

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ గా నన్ను నియమించిన దగ్గర నుండి కూడా పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తున్నాను.

పార్టీ పిలుపు మేరకు బాదుడే బాదుడు గాని,సభ్యత్వ నమోదు గానీ ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం గాని అందరిని కలుపుకుని ప్రతి నిత్యం ప్రజలలో ఉండేలా నిర్వహించడం జరిగింది.

నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తున్న మా అధినేత చంద్రబాబు నాయుడుకి, యువనేత నారా లోకేష్ కి, ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడానికి అహర్నిశలు తన వెన్నంటి నడుస్తున్న బాపట్ల నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు నరేంద్ర వర్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జోన్ 3 సమీక్ష సమావేశానికి బాపట్ల నియోజకవర్గ ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జ్ లు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శి లు హాజరయ్యారు.


SAKSHITHA NEWS