జోరు వానను సైతం లెక్కచేయకుండా రైతుల కష్టాలు తెలుసుకుంటున్న చంద్రబాబు
ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అధినేత చంద్రబాబుకు వివరిస్తున్న జ్యోతుల నెహ్రూ
సాక్షిత : ఉమ్మడి గోదావరి జిల్లాలు మే 4/ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేశారు. ఆయనకు టిడిపి శ్రేణులు భారీ స్వాగతం అందించారు. రెండు రోజులుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తూ పంట నష్టాన్ని తెలుసుకుంటున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూను పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు అనంతరం టిడిపి కమిటీ తో కలిసి పంట నష్టపోయిన ప్రాంతాలను పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం వెంటనే రంగు మారిన ధాన్యాన్ని, మొలకలు వచ్చిన ధాన్యాన్ని తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులకు అవసరమైన గోనె సంచులను సమకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడిపి ఏర్పాటు చేసిన పంట నష్ట వివరాలతో కూడిన ఫోటో పరిశీలించారు. సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత వారం రోజులుగా రైతులు కంటిమీద కునికి లేకుండా కళ్ళల్లో వానకు తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేని దీనస్థితిలో ఉన్నారని ప్రభుత్వం ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని రైతుల గోడు వినిపించుకునే నాధుడే లేడని లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయి వృధాగా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి కేఎస్ జోవహార్, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, తోట సీతామహాలక్ష్మి, గన్ని ఆంజనేయులు, రాష్ట్ర రైతు స్టీరింగ్ కమిటీ సభ్యులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.