అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం..
వెంటనే అదానీ అవినీతిపై పార్లమెంటరీ జేపీసీ కమిటీ వేయాలి అని పెద్దఎత్తున్న కదిలిన కాంగ్రెస్ శ్రేణులు..
హాజరైన నీలం మధు ముదిరాజ్..
వందల వాహనాలతో భారీ ర్యాలీ గా చిట్కుల్ నుండి వెళ్లిన నీలం మధు..
బుధవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీప దాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి వంద వాహనాలతో భారీ ర్యాలీగా చిట్కుల్ నుండి వెళ్లి హాజరైన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్..
అమెరికా లో గౌతమ్ ఆధాని పై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీసాయి. ఆధాని పై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మని లాండరింగ్, మార్కెట్ మనిపులేషన్ లాంటి అంశాలలో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీసాయని అలాగే మణిపూర్ లో వరసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై మోడీ ఇప్పటి వరకు అక్కడకు వెళ్లలేదంటూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని బిజెపి ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు..