మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ – రజక సంఘం జిల్లా కార్యదర్శి కొడెపాక రవీందర్
కమలాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
సాక్షిత కమలాపూర్ :
పెత్తందారి తనం, దౌర్జన్యాలు అరాచకాలపై తిరుగుబాటు చేసి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రజక సంఘం హన్మకొండ జిల్లా కార్యదర్శి కొడెపాక రవీందర్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రం లోని సబ్ స్టేషన్ సర్కిల్ లో కమలాపూర్ రజక సంఘం ఆధ్వర్యం లో చాకలి ఐలమ్మ 129 వ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి ఆమె చేసిన ఉద్యమాలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా కొడెపాక రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ ధిక్కార స్వరానికి నిలువుటద్దం మహిళలోకానికి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.సబ్బండ వర్గాల ఆశాజ్యోతి.,
బడుగు బలహీనవర్గాల గురించి కొట్లాడిన విరవనీత, భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం రైతు కూలీలను ఏకం చేసి విస్నూరు దేశముక్ దొరలపై తిరుగుబాటు చేసి పెత్తందారితనం అరాచకాలు దౌర్జన్యలపై తిరుగుబాటు చేసి తెలంగాణ తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన విరవనీత చాకలి ఐలమ్మ అని ఆన్నారు. అలాగే మహిళా లోకానికి స్ఫూర్తిని ఇచ్చిన తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ అనిఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం డివిజన్ కార్యదర్శి వైనల సాంబయ్య, మండల రజక సంఘం అధ్యక్షులు మీరుపూరి విజయ్, జిల్లా రజక సంఘం నాయకులు దొడ్డిపాటి సారయ్య, బ్లార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలసాని రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులుగుండపు చరణ్ పటేల్, సభ్యులు ముప్పు కొమురయ్య,ఆవునూరి తిరుపతి, చంద్రమౌళి,వైనాలా ఐలయ్య, కొలిపాక సురేష్, రావుల కొమురయ్య, కొత్తకొండ సతీష్, చేరాలు, నాగపురి రాజమౌళి, బండి కొమురయ్య, రావుల సదయ్య, దేవరాజు సాంబయ్య, రావుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.