13వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం: చైర్మన్
శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధి 13వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.