నంద్యాల మండలం చాబోలు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకుకృషి చేస్తామని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం చాబోలు గ్రామంలో 30లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, ఎంపీలు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని చాబోలు గ్రామాన్ని ఎంపీ దత్తత తీసుకొని అభివృద్ధి చేపట్టారని అన్నారు. ఎంపీ నిధులతో రోడ్లు వేయించడం జరిగిందని, నేడు 30లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 45 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని, టెండర్లు ప్రక్రియ పూర్తి కాబడిందని, త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం నిధుల నుండి 20లక్షలు మంజూరు కాబడ్డాయని, ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపటతామన్నారు. దాదాపు ఈ గ్రామంలో ఎంపీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలైన నిధులతో 2కోట్ల రూపాయల మేర అభివృద్ధి చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం సంక్షేమం పథకాలు అందించడం మాత్రమే కాదని, అభివృద్ధిని చేసి చూపెడుతున్నామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే కోవిడ్ రావడం వల్ల రెండు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు కొంత మేర ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, భవిషత్తులో చాబోలు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేపడతామన్నారు. అభివృద్ధి, సంక్షేమం అందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని, రానున్న ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని వారు ప్రజలను కోరారు. చాబోలు గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో MPDO సుగుణశ్రీ,mptc చిన్నయ్య,సర్పంచ్ కడియం మౌనిక తిమోతి,నగనందరెడ్డి,రాజగోపాల్ రెడ్డి,మదర్ సా, పాలమాబు, తిమోతి, బాల ఉషేని,వేణుగోపాల్ రెడ్డి,మధుగోపాల్ రెడ్డి,విశాల్ రెడ్డి, మహేష్,మరియు గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు