సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి
శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి
సి -విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయచ్చు మరియు అప్ ను సద్వినియోగం చేసుకోండి జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
జిల్లాలో జరుగబోయే ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS అన్నారు.
మహబూబాబాద్ టౌన్ MRO సెంటర్ నుండి అండర్ బ్రిడ్జి మీదుగా మదర్ తెరెస స్టేట్యూ, బస్సు స్టేషన్, జింకల సెంటర్, అయ్యప్ప టెంపుల్, మీదిగా తిరిగి ఎమ్మార్వో సెంటర్ వరకు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది.ఈ రోజు కేంద్ర బలగాల అధికారులతో జిల్లా ఎస్పీ అదనపు ఎస్పీ జోగుల చెన్నైయ్య, ట్రైనీ ips పండరి చేతన్, డిఎస్పీలు, సీఐ లు, ఎస్. ఐ లు,తో కలసి కవాతు లో పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు సంబంధించి జిల్లా కు కేంద్ర బలగాలు వచ్చాయని త్వరలో మరిన్ని బలగాల వస్తాయని అన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు . జిల్లా లొ మొత్తం 1783 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో కొన్నింటిని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది అన్నారు.ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్రామంలోని ప్రజలంతా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే గ్రామము, జిల్లా అభివృద్ధి చెందుతుందని కావున ప్రజలంతా వర్గ బేధాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఒకరికి ఒకరు కలిసి మెలిసి సామరస్యంగా ఉండాలని తెలిపారు. ప్రజలంతా ఎలక్షన్ సమయంలో పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కవాతు అనంతరం పారామిలిటరీ సిబ్బంది మరియు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తో మాట్లాడుతూ…… ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం విధులు నిర్వహించాలని,పారామిలిటరి దళాల అధికారులకు ఎన్నికలకు సంబంధించి తగు సూచనలు చేశారు.
సమాచార పౌరసంబంధాల అధికారి, జిల్లా అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీచేయనైనది.