SAKSHITHA NEWS

ఘనంగా దుర్గమాత నిమ్మజనం వేడుకలు

*.
సాక్షిత : దుర్గామాత ఊరేగింపులో పాల్గొన్న..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడా ట్రేడ్ సెంటర్, తారనగర్, ఆదర్శ్ నగర్ మరియు వివిధ కాలనీలలో నిర్వహించిన దుర్గామాత ఊరేగింపు కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మియాపూర్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి ఊరేగింపు లో హాజరయ్యారు. ఈ సందర్భంగా నృత్యాలు, మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. కార్పొరేటర్ డీజే స్టెప్పులు వేసి యువతలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..శేరిలింగంపల్లి డివిజన్ లో వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన, దసరా నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న దేవి మాత విగ్రహాల నిమర్జన ఘట్టంలో భాగంగా కన్నుల పండువగా అంగరంగా వైభవంగా ఊరేగింపు కొనసాగుతుందని అన్నారు.

ఇలాంటి కార్యక్రమాలతో ఐక్యమత్యం పెంపొందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి అస్సిసులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, కృష్ణ రెడ్డి, వార్డ్ మెంబర్ కవిత గోపాల కృష్ణ, ఆయా దుర్గా మాత కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS