CCTV cameras play an important role in crime control
నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి…
కుత్బుల్లాపూర్ డివిజన్ లో రూ.1.70 లక్షలతో ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సుదర్శన్ రెడ్డి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో కాలనీ వాసుల సౌజన్యం రూ.1.70 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారు, జీడిమెట్ల సీఐ పవన్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో అనేక లాభాలున్నాయన్నారు. నేరాలను అదుపు చేయడం, అసాంఘిక శక్తుల అరాచకాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతీ కాలనీ సంక్షేమ సంఘాలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. కాలనీల అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ రామ్ రెడ్డి, సెక్రెటరీ కేఎస్ రావు, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర్ రావు, యూత్ ప్రెసిడెంట్ సాయివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్తిరెడ్డి, సురేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.