SAKSHITHA NEWS

CC roads, UGD for construction works

సాక్షిత : కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్, ఆస్బె స్టాస్ ,దీనబంధు, ప్రగతి నగర్ ,పాపరాయుడు నగర్, హనుమాన్ నగర్ కాలనీ లలో రూ. (2.17.05 లక్షలు) రెండు కోట్ల పది ఏడు లక్షల ఐదు వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్లు, UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా కూకట్పల్లి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు సీసీ రోడ్లు, UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, పార్క్ లను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ లో రూ. 39.90 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

2.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ లో రూ. 22 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే UGD నిర్మాణ పనులు

3.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బె స్టాస్ కాలనీ లో రూ. 65.05 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

4.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీ లో రూ. 19.20 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

5.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ కాలనీ లో రూ. 18.10 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

6.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపరాయుడు నగర్ కాలనీ లో రూ. 42.80 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

7.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీ లో రూ.10 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

పైన పేర్కొన్న సీసీ రోడ్లు, UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు ఉట్ల చంద్రారెడ్డి, నాగేశ్వరరావు,ఎల్లం నాయుడు, MD ఇబ్రహీం, చిట్టెం శ్రీధర్ రెడ్డి, కనకరెడ్డి, బగవంత్ రెడ్డి,నర్సింలు, రామకృష్ణ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్,ప్రేమ్ కుమార్,రాజీ రెడ్డి అబుల్ ,ప్రసాద్ ,కృష్ణ ,తిరుపతిసాంబశివుడు,ప్రభాకర్ ,భులక్ష్మి, పద్మ ,శ్రీ జ్యోతి, పద్మ లావణ్య ,పద్మ ,కవిత,లీల తెరాస నాయకులు ,కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS