SAKSHITHA NEWS

CC roads to be undertaken with an estimated cost of five crore sixty lakh rupees

సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్,తార నగర్, వేమన వికర్ సెక్షన్,వేమన రెడ్డి,సురక్ష ఎనక్లేవ్, గౌతమి నగర్, అన్న పూర్ణ ఎనక్లేవ్, శ్రీరాంనగర్,రాజేందర్ రెడ్డి,పద్మజ కాలనీ లలో రూ. (5.60 లక్షలు) ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా చందానగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, పార్క్ లను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.చందా నగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎనక్లేవ్ కాలనీ లో రూ. 100 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

2.చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ కాలనీ లో రూ. 61.80 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు

  1. చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ లో రూ.33 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
  2. చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ లో రూ.229.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
  3. చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి వికర్ సెక్షన్ కాలనీ లో రూ.22.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
  4. చందానగర్ డివిజన్ పరిధిలోని పద్మజ కాలనీ లో రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
  5. చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీ లో రూ.25.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
  6. చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి కాలనీ లో రూ.25.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
  7. చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ కాలనీ లో రూ.25.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
  8. చందానగర్ డివిజన్ పరిధిలోని తార నగర్ కాలనీ లో రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు

పైన పేర్కొన్న సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలోమాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు ,లక్ష్మి నారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తెరాస నాయకులు మిర్యాల రాఘవ రావు, జనార్ధన్ రెడ్డి , గోపీ కృష్ణ , సుప్రజ ప్రవీణ్ , కరుణాకర్ గౌడ్ , ఓ వెంకటేష్ , వరలక్ష్మి రెడ్డి , అక్బర్ ఖాన్ , అహ్మద్ పాషా , ఎల్లమయ్య , కార్తీక్ గౌడ్ , శ్రీకాంత్ , దీక్షిత్ రెడ్డి , అమిత్ దూబే , రాజశేఖర్ రెడ్డి , జనార్దన్ గౌడ్ , శ్రీనివాస్ , కొండల్ రెడ్డి , అస్ఫర్ , యూసుఫ్ పాషా , బాబు మరియు తెరాస నాయకులు ,కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS