నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 13 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు
-ట్రాఫిక్ ఏసీపీ
నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న లెటర్స్ ను తొలగించి నగరంలో చక్కర్లు కొడుతున్న 13 ద్విచక్ర వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలో నిబంధనలు అతిక్రమించి రోడ్లపై నడుపుతున్న వాహనాలపై నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తనిఖీలో భాగంగా శుక్రవారం నాడు పలు కూడళ్ళలో నెంబరు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి, కేసులు నమోదు చేసేందుకు ఖమ్మం వన్ టౌన్ , టూ టౌన్ ,త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారు చలనాల నుండి తప్పించుకోవడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు
రిజిస్ట్రేషన్ నంబర్ లోని టీఎస్, ఏపీ అక్షరాలతో పాటు చివరి రెండు నంబర్లు కనిపించకుండా స్టిక్కర్స్, ప్లాస్టర్స్,మాస్క్ లు వేస్తున్నారని తెలిపారు. కొన్ని వాహనాలకు ముందు నంబర్ ప్లేట్ కరెక్ట్ గా ఉన్నప్పటికీ వెనుక నంబర్ ప్లేట్ మాత్రం బెండ్ చేస్తున్నారని తెలిపారు.
ఇలాంటి రాంగ్ నెంబర్ ప్లేట్లతో రోడ్లపై ఇష్టమొచ్చినటుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని పెర్కొన్నారు. నంబర్ లేని బైక్స్ పై చైన్ స్నాచర్లు నేరాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
నంబర్ ప్లేట్ లేని వికృతమైన నంబర్ ప్లేట్లను కలిగిన వాహనాలపై 420/511 మరియు మోటార్ వెహికల్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.