
సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్‌ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేశారు. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్న జగన్‌పై గత నెలలో నిందితుడి రాయి దాడి చేసిన విషయం తెలిసిందే.
