SAKSHITHA NEWS

Case against MLC Kavitha is part of political party’s act: MLA Kranti Kiran

రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఎమ్మెల్సీ కవితపై కేసు: ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా బీజేపీ ప్రోద్భలంతో ఇలాంటి బూటకపు కేసులకు ఈడీ పూనుకుంటున్నదని చెప్పారు.

సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కవితపై కేసు నమోదుచేశారని విమర్శించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని చెప్పారు. దేశంలోని బీజేపీ యేతర ప్రభుత్వాలను అస్థిరం చేసినట్లుగానే.. తెలంగాణలోనూ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను కూల్చాలని చూశారని విమర్శించారు. అయితే ఆ కుట్రను సీఎం కేసీఆర్ భగ్నం చేశారని, దానికి ప్రతీకారంగానే ఢిల్లీ లిక్కర్ కేసని ఆయన చెప్పారు.


SAKSHITHA NEWS