SAKSHITHA NEWS

వరద బాధితుల సహాయక చర్యల్లో కార్ ఇన్ ఆటో మార్ట్ సంస్థ యాజమాన్యం, సిబ్బంది.

-కార్ ఇన్ ఆటోమార్ట్ సంస్థ అధినేత అబ్ధుల్ అజీమ్ ఆధ్వర్యంలో….

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం మున్నేరుకు వరద పోటెత్తింది.. ఫలితంగా ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతమంతా మున్నేరు వరద నీటిలో చిక్కుకుంది.. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు అందిస్తున్న నేపథ్యంలో.. మానవీయకోణంతో సామాజిక సేవదృక్పథంతో ఖమ్మం జిల్లా కేంద్రంలోని కార్ ఇన్ ఆటోమార్ట్ సంస్థ అధినేత అబ్దుల్ అజీమ్ నేతృత్వంలో ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్ ప్రాంతంలో చిక్కుకున్న సుమారు 30 మందిని బోట్ సహాయంతో సహాయక చర్యల్లో భాగంగా వారిని కాపాడారు.. అనంతరం ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీమ్ మాట్లాడుతూ…ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా తమ సంస్థ ఆధ్వర్యంలో మానవీయకోణంతో సామాజిక సేవల్లో భాగంగా సహాయక చర్యలకోసం అర్ధరాత్రి కూడా తమ వంతు విధిగా విధులు నిర్వహించి 30 మంది స్థానికులను అపార్ట్మెంట్ వద్ద వరదనీటి ప్రవాహం నుoచి సురక్షిత ప్రాంతాలకు చేరవేయడం లోతాము కూడా భాగస్వామ్యం కావడం జరిగిందని పేర్కొన్నారు… సంస్థ అధినేత స్నేహితులు అబ్ధుల్ వహీద్, శఫ్సత్ అలి, మున్ను భాయ్, మున్వర్ వసీమ్ , నసీమ్ తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS