Cancer Awareness Walk Rally organized by Kim’s Hospital
సాక్షిత : * ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మధినాగుడా లోని రామకృష్ణ నగర్ కాలనీ లో కిమ్స్ ఆసుపత్రి వారి సౌజన్యం తో నిర్వహించిన క్యాన్సర్ అవగహన నడక ర్యాలీని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజలకు కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతీయేట ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా గుర్తిస్తారు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ప్రజలకు క్యాన్సర్ వ్యాధి పై అవగహన పెంచుకుందాం క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం అని,క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందిస్తే నియంత్రణ సాధ్యమే అని ,ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం, మద్యం సేవించడం వంటి దురులవాట్లకు దూరంగా ఉండండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని క్యాన్సర్ నుండి కాపాడుకోండి అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
ప్రజల్లో అవగాహన పెంచడం తద్వారా క్యాన్సర్ కళంకం తగ్గించడం క్యాన్సర్తో బాధపడుతున్నవారికి మద్దతు ఇవ్వడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో అనేక కార్యక్రమాలు అమలులో ఉన్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు అవగహన కలిగి ఉండి క్యాన్సర్ మహమ్మారి ని ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రజలకు ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాలా హరీష్ రావు బీఆర్ ఎస్ పార్టీ నాయకులు బాబు మోహన్ మల్లేష్, విష్ణు వర్ధన్ రెడ్డి, రసూల్, కృష్ణ రావు, ఉమ మహేశ్వర రావు, నాగేశ్వరరావు, రాము,రవి చందు,ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.