SAKSHITHA NEWS

అమరావతి:

2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది.జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు.దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది.

మెయిన్స్‌ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది.

ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

WhatsApp Image 2024 03 13 at 1.57.36 PM

SAKSHITHA NEWS