సి.సి రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
సాక్షిత : వరంగల్ జిల్లా…..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామం నందు సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో సి. సి రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం నేడు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* ……
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ:-
ఈ రోడ్డు కోసం ఎవరు ఎన్ని ఆటంకాలు ఎదురైనా 80 ఫీట్ల రోడ్డును వేయించి అలాగే రోడ్డు మార్గంలో ఇండ్లు కోలిపోతున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తాను. ఎవరు అధైర్య పడవద్దని ప్రతిపక్షాల వారి మాటలు నమ్మి మోసపోవద్దని ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు…..
అలాగే ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం 3500 ఇండ్లు కేటాయించగా సిఎం రేవంత్ రెడ్డి నా నియోజకవర్గం దళిత నియోజకవర్గం అని చెప్పి 5000 వేల ఇండ్ల మంజూరు చేయాలని అని కోరాను….
అలాగే మీకు ఏ సమస్య ఉన్న నా డయల్ యువర్ ఎమ్మెల్యే టోల్ ఫ్రీ నెంబర్ 8096107107 కి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేసే వారు పరిష్కార దిశగా ముందుకు తీసుకువెళ్తారు….
అనంతరం దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది….
అనంతరం కమ్మిటి సభ్యులు ఎమ్మెల్యే కి శాలువాతో సత్కరించడం జరిగింది….
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను శీభరాణి – అనిల్ కుమార్, తో పాటు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….