SAKSHITHA NEWS

వచ్చే హోలీ నాటికి అర్హులంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లలో ఉంటారు

  • ఆరు గ్యారంటీలతో అందరికీ లబ్ధి జరుగుతోంది..
  • కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి
  • కూసుమంచిలోని మంత్రి శీనన్న క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకలు

అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చబోతోందని.. వచ్చే హోలీ నాటికి పేదలంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లల్లో ఉంటారని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం అయన కూసుమంచి లోని మంత్రి పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయంలో గిరిజన మహిళలు, నాయకులతో కలిసి ముందస్తుగా రంగుల పండుగ సంబరాలు జరుపుకున్నారు.

సతీమణి శ్రీలక్ష్మి తో కలిసి బంజారాలతో ముచ్చట..

కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి.. తన సతీమణి శ్రీలక్ష్మితో కలిసి వివిధ తండాల నుంచి వచ్చిన బంజారా మహిళలతో ముచ్చటించారు. సంప్రదాయబద్ధంగా జరుపుకునే హోలీ వేడుకల విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకున్నారు. ఆ తర్వాత అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..ఇచ్చిన మాట ప్రకారం ఆరుగ్యారంటీల అమలు ఆరంభమైందని, అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని అన్నారు. ప్రాధాన్యం ప్రకారం అందరికీ న్యాయం జరిగేలా మన పొంగులేటి శీనన్న కృషి చేస్తున్నారని అన్నారు. ఈ హోలీ పండుగను అంతా సంతోషంగా, సంబరంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 24 at 4.01.39 PM

SAKSHITHA NEWS