SAKSHITHA NEWS

Butcher’s husband who transfused his wife with HIV blood

భార్యకు హెచ్ఐవి రక్తం ఎక్కించిన కసాయి భర్త

గుంటూరు : కంటికి రెప్పలా కాపాడాల్సిన కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు.తనను వదిలించుకోవాలని చూస్తున్న భర్త దారుణానికి పాల్పడ్డాడని… హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ ఎక్కించాడంటూ ఓ వివాహిత ఆరోపిస్తోంది.

ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రాణాంతక వైరస్ ను ఎక్కించిన భర్తపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసానని… అయినా వారు పట్టించుకోవడం లేదంటూ బాధిత మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ భర్తపై కేసు నమోదు చేయడంలేదని ఆరోపించారు.

వెంటనే తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళ మంగళగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు


SAKSHITHA NEWS