SAKSHITHA NEWS

జనవరి 3 ఆదిలాబాద్ తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి

నేటితో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు

కార్యకర్తల వల్లే ఇన్నేళ్ళుగా పార్టీ బలంగా ఉంది

గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారు

నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించింది

ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదు

ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయి

సూర్యాపేటలో మాత్రమే గెలిచాం

పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు

ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి

ఈ పార్లమెంటు సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమే

ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయి

సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్టలేకపోయాం

అవతలి వాళ్లు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారు

మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారు

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండి

అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగన లేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు

హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టె ప్రయత్నం చేస్తోoది.. అయినా వదిలి పెట్టం

ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారు

కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాంస వీడాలి.. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు. ఇపుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలి

కోమటి రెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారు

నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపండి

సాగర్ ఆయకట్టు కు కాంగ్రెస్ పాలన లో మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించింది

కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోంది

శ్రీ రాం సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండ బెడుతోంది

కరెంటు కోతలు అపుడే మొదలు అయ్యాయి

కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడింది

రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోడీ బీఆర్ఎస్ ను కాలుస్తారట

మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ బీజేపి అక్రమ సంబంధం గురించి చెప్పాలి

రాహుల్ అదానీని దొంగ అన్నారు రేవంత్ దొర అంటున్నాడు

కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలి

కాంగ్రెస్ కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయి

నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టి గా పనిచేసి గెలుద్దాం

ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, నల్లగొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 22 At 1.49.18 Pm

SAKSHITHA NEWS