అన్నదాత కు అండగా బిఆర్ఎస్ ఉధ్యమ బాట
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లకు బిఆర్ఎస్ శ్రేణుల వినతి పత్రాలు
రైతులకు 25 వేల నష్టపరిహారం, రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్
సాక్షిత సూర్యాపేట
పాలకుల నిర్లక్ష్యం తో
నిండా మునిగిన అన్నదాతలకు అండగ బిఆర్ఎస్ ఉధ్యమం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నేడు
ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పిలుపుమేరకు రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు అమలు చేయాలని కోరుతూ మాజీ మంత్రి ,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సారథ్యం లో కలెక్టరేట్ కార్యాలయాల్లో టిఆర్ఎస్ నాయకుడు ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు.. నీరు, విద్యుత్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. సర్కార్ అలసత్వం వల్ల జిల్లా లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లున్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాల అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ ,ఎంపీపీలు నెమ్మది బిక్షం, మర్ల చంద్రారెడ్డి, జడ్పిటిసి జీడి బిక్షం, రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, సింగిల్ విండో చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్ , తూడి నరసింహారావు, బత్తుల ప్రసాద్ , ముదిరెడ్డి అనిల్ రెడ్డి, యాదగిరి ముదిరాజ్ , ఎలక వినోద్ తదితరులు పాల్గొన్నారు.