ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వాక్యలు చేస్తున్న గద్వాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత తిరుపతయ్య
కాంగ్రెస్ అభ్యర్థి మాటలతో భయాందోళన చెందుతున్న గద్వాల వ్యాపారస్తులు
నడిగడ్డలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి
పాతకక్షలు, కుటుంబాల సమస్యలను పార్టీ గొడవలుగా చిత్రికరించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది
చదువుకున్న వ్యక్తి అంటున్నారు కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం వారి మనస్తత్వానికి నిదర్శనం
జడ్పి చైర్మన్ గా గద్వాల ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలి
ఎవరు ముటేముల్ల సర్దుకొని వెళ్తారో త్వరలోనే ప్రజలు నిర్ణయిస్తారు
అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా లేక అలజడులు సృష్టించే వ్యక్తులు కావాలో విజ్ఞులైన గద్వాల ప్రజలు ఆలోచించి ఓటేయాలి
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు విలేకరుల సమావేశంలో గద్వాల శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండ కృష్ణమోహన్ రెడ్డి
దశాబ్దాలుగా గద్వాల ప్రాంతంలో అన్నదమ్ముల వాలే, కుటుంబ సభ్యులుగా జీవిస్తున్న ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత తిరుపతయ్య కులాల కుంపట్లు పెడుతూ ప్రశాంతంగా ఉన్న అలజడులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని గద్వాల శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విమర్శించారు.
నిన్న పెద్దపల్లి గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య పాత కక్షలు, కుటుంబ కలహాలతో జరిగిన గొడవని రాజకీయంలోకి లాగడం తగదన్నారు.
ఓటమి పాలవుతున్నామని తెలిసి గద్వాల ప్రాంతంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రానున్న కాలంలో మరిన్ని దాడులు చేయడం లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, దీనిపై బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.
నేను చదువుకున్న వ్యక్తిని అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొక్కేస్తా… తొక్కుకుంటా పోతా ..కనపకుండా చేస్తా… వంటి మాటలు మాట్లాడడం దారుణం అన్నారు.
జడ్పీ చైర్మన్ గా గద్వాల ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేశారో.. ఎన్ని నిధులు కేటాయించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. టూరిస్ట్ నాయకులు చెబుతున్నట్లు ఎవరు ఎవరిని తొక్కుతారో ఎవరు మూట ముల్ల సర్దుకొని గద్వాల ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్తారో త్వరలోనే విజ్ఞులైన గద్వాల ప్రజలు ఓటు ద్వారా నిర్ణయిస్తారని హెచ్చరించారు.
కాంగ్రెస్ అభ్యర్థి రెచ్చగొట్టే మాటలతో గద్వాల ప్రాంత వ్యాపారస్తులు భయాందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోట్లు పెట్టి కాంగ్రెస్ సీటు కొనుకున్న వారు గద్వాల ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదని, దోచుకునేందుకు.. దాచుకునేందుకు వచ్చారని విమర్శించారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి అభివృద్ధి చేసిన చెస్తున్న వ్యక్తి కావాలో లేక కులాల కుంపట్లు పెడుతూ రెచ్చగొట్టె విధంగా మాట్లాడుతున్న వ్యక్తులు కావాలో విజ్ఞులైన గద్వాల ఓటర్లు నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, రాధాకృష్ణ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.