SAKSHITHA NEWS

బీఆర్ఎస్ పథకాలు బీఆర్ఎస్ నేతలకే

బిసి రుణాలపై స్పష్టత లేదు

మళ్ళీ మైనార్టీ రుణాలు అంటూ నయా మోసం

అధికారుల బదిలీల్లోనూ అవకతవకలు

నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆరోపణ

……

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ ముఖ్య అనుచరులకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మధ్యతరగతి సామాన్య పేదలకు ఏమాత్రం లబ్ది చెందడం లేదని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఎన్నికలప్పుడే కేసిఆర్ కు ప్రజలు గుర్తు వస్తారని 9 ఏళ్ల నుండి ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలు చేయలేదని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, మూడు ఎకరాల భూ పంపిణీ హామీలు అమలు చేయకుండా కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు తయారు అవుతున్నాడని ఎద్దేవా చేశారు.

బిసి రుణాల పంపిణీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు దారుల నుండి దాదాపు 350కోట్ల రూపాయలు వచ్చాయని నియోజక వర్గానికి 300 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 607 మండలాల్లో ఇంచు మించు రెండు లక్షల మందిని ఎంపిక చేసిందని ఇందులో 70 శాతం మంది బీఆర్ఎస్ గులాబీ నేతల అనుచరులే ఉన్నారని స్పష్టం చేశారు. అధికారుల బదిలీలోనూ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న అధికారిని తమకు కావాల్సిన స్థానంలో స్ధాన చలనం చేస్తుందని అవసరం లేని పోస్ట్ ని కూడా కల్పించి ఆ పోస్ట్ లోకి పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారిని నియమించుకుంటున్న సంఘటనలు జిల్లాల్లో కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు.

కచ్చితంగా బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు సిద్ధంగా ఉందని అధికారం లోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చు కుంటామని తెలిపారు. అనంతరం బిసి సెల్ అధ్యక్షులు బానాల లక్ష్మణ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు మోజాహిద్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ…ఎన్నికల వేళ బిఆర్ఎస్ మయ మాటలకు ప్రజలు లొంగిపోవద్దని తొమ్మిది ఇంతవరకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయాలేదని స్పష్టం చేశారు. బిసి రుణాలు పంపిణీ చేయకుండానే మైనార్టీ రుణాల పేరుతో నయా మోసం చేయాలని చూస్తున్నారని ఈ మోసాలను ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు మూజహిధ్ హుస్సేన్, ఖమ్మం నగర మైనారిటీ సెల్ అధ్యక్షులు అబ్బాస్ బెగ్, ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవికుమార్, బీసి సెల్ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్ ,23 డివిజన్ అధ్యక్షులు సయ్యద్ మహమూద్, 20 డివిజన్ అధ్యక్షులు మూజహిద్, తది తరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS