దూలపల్లిలో వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలో మనోజ్ కుమార్ మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ బందు పథకం ద్వారా ఈ షాపును ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని, నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగం చేసిన వైపు తమ కాళ్లపై తాము నిలబడేందుకు స్వయం ఉపాధిని ఎంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, గంగయ్య నాయక్, కౌన్సిలర్లు డప్పు కిరణ్, శివకుమార్ గౌడ్, దూలపల్లి పాక్స్ డైరెక్టర్ బూర్గుబావి సత్యనారాయణ, మాజీ డైరెక్టర్ నవీన్ గుప్త, దూలపల్లి మాజీ సర్పంచ్ చింతల దేవేందర్ యాదవ్,సుధాకర్, మహేష్, అభిషేక్, తదితరులు పాల్గొన్నారు.