2014 కంటే ముందు ఎట్లుండే మన కాలనీలు… ఇప్పుడేట్లున్నయి : ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద
గోదావరి హోమ్స్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో 132- డివిజన్ ప్రజా ఆశీర్వాద సభ మరియు చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ లో ప్రజా సంక్షేమం, కాలనీల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అభివృద్ధి పరచామని, సీఎం కేసీఆర్ ని మూడవసారి హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకొని మరింత అభివృద్ధిని చేపడుతామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలు, యువకులు, మహిళలు 2014 కంటే ముందు జరిగిన అభివృద్ధిని ఇప్పుడు గత తొమ్మిదేళ్లలో నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, మంజీరా నీటి వసతులను కల్పించామని, రాబోయే రోజుల్లో కేసీఆర్ ని ముచ్చటగా మూడవసారి సీఎం గెలిపించుకుని మరిన్ని నిధులు రాబట్టి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు.
అనంతరం 132 డివిజన్ వివేకానంద నగర్ మాజీ కాలనీ ప్రెసిడెంట్, బీజేపీ సీనియర్ నాయకులు సత్తయ్య గౌడ్ , బిఆర్ఎస్ యూత్ నాయకులు రాజు యాదవ్ ఆధ్వర్యంలో బిజేపి, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన 100 మంది యువకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : శివ, అజయ్, సతీష్, అరవింద్, భరత్, నవీన్ రెడ్డి, ఆశిష్, దానిష్, కార్తీక్, సోమేశ్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ అధ్యక్షులు, సంక్షేమ సంఘం సభ్యులు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.