సాక్షిత గజ్వేల్ :
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కొట్టడం ఖాయమని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరై లబ్ధిదారులకు శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి ,స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. అలాగే మంత్రి హరీశ్ రావు సమక్షంలో గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…
గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్‌లో వాల్ల గొడవలు వాళ్లకే తప్ప ప్రజల బాధలు పట్టవని మండిపడ్డారు. బీజేపీకి బలం లేదు.. కాంగ్రెస్‌కు కాండిడేట్లు లేరన్నారు.. బీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్నారు..
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అంటున్నారన్నారు. ఇది బీఆర్‌ఎస్ పాలనకు నిదర్శనమని మంత్రి హరీశ్ రావు అన్నారు…