SAKSHITHA NEWS


BRS is a party that will show an alternative to the country’s politics

దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయం చూపనున్న BRS పార్టీ: వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” కోట్ పల్లి మండల BRS పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

స్వరాష్ట్రం సాధించిన తర్వాత సంపూర్ణ సంక్షేమం అందిస్తూ… అభివృద్ధిలో ముందుకు సాగుతున్న తెలంగాణ పై, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణులను వ్యతిరేకిస్తూ… ప్రజా సంక్షేమాన్ని దేశవ్యాప్తంగా అందించాలనే సంకల్పంతో దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయ వేదికగా ఏర్పాటైన BRS పార్టీ కోసమే మనమంతా పని చేయాలన్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు.

ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఓపిక సహనంతో పని చేయాలని, పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS