బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న…
- జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ..
గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుచున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉదయం సమయంలో విద్యార్థులు బ్రేక్ ఫాస్ట్ ఇబ్బందులకు గురౌతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ చేతులమీదుగా ప్రారంభించారు… అంతకుముందు పాఠశాల తరగతి గదులలో విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం గల కారణాలను అడిగి తెలుసుకున్నారు… ప్రస్తుతం పంటపొలాల పనులకు వెళుతున్నాట్లు తెలిపారు…అనంతరం జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పిల్లల తల్లిదండ్రులు విద్యార్థుల చదువుకు భంగం కలగకుండా ఉండే విధంగా కృషి చేయాలని,విద్యార్థులను పొలం పనులకు,కూలీ పనులకు పంపకుండా పాఠశాలకు పంపాలన్నారు…విద్యార్థి దశ నుంచే ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ముందుకు పోవాలని సరితమ్మ విద్యార్థులకు సూచించారు…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు,బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి,అమరావాయి కృష్ణారెడ్డి,డి.సత్యరెడ్డి, గోకరన్న,నారాయణ,మూర్తి, గోవింద్, ఆశన్న,కర్రెప్ప,ధరూర్ శ్రీకాంత్ రెడ్డి, జమ్మిచేడు ఆనంద్,ఏ.కే.వెంకటన్న, పెదొడ్డి రామకృష్ణ, జలీల్, సద్దనోముపల్లి గోపాల్,భాస్కర్,హెడ్ మాస్టర్ మహేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు