SAKSHITHA NEWS

సాక్షిత న్యూస్ జర్నలిస్టు ప్రవీణ్ ను సన్మానించిన బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ

శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో చాళుక్య రాజులు వెయ్యి ఏళ్ల క్రితం స్థాపించిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మండల, మున్సిపాల్టీకి చెందిన వివిధ పత్రికల జర్నలిస్టులు స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు ప్రమోద్ జర్నలిస్టులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మన సాక్షి గొంతుక జర్నలిస్టు గండేటి రాజేష్ గౌడ్ ను, వివిధ పత్రికల జర్నలిస్టులను స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి, స్వామి వారి చిత్రపటాలను బహుకరించారు.

స్వామికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందజేస్తామని జర్నలిస్టులు తెలిపారు. అభయానికి మారుపేరుగా నిలిచే మరకత లింగేశ్వరుడు ఆరోగ్య దైవమని ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర రాజు స్వామి అన్నారు. మరకత శివుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ శాంతులతో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు సదానందం గౌడ్, అన్నదాన కార్యక్రమ చైర్మన్ దర్శన్ గౌడ్, వైస్ చైర్మన్ శేఖర్, కమిటీ సభ్యులు హనుమంతు, గోపాల్, వెంకటస్వామి, లీలావతి, జనార్ధన్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS