సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు… తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాలలో భాగంగా విద్యా దినోత్సవ సందర్భంగా తన సొంత నిధులతో ఓల్డ్ బోయిన పల్లి హస్మత్ పేట పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బ్యాగ్ …వాటర్ బాటిల్ కిట్లు అందించారు …ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం నియోజకవర్గం లో 11 వేల మంది విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు.. బ్యాగ్ కిట్లు అందించామని….అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులందరికీ ఈ విధంగా ఇస్తున్నాం అని అన్నారు…
ఇందులో భాగంగా నే నేడు బోయిన పల్లి లో 700 మంది విద్యార్థులకు అందించాం అని తెలిపారు… అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మన ఊరి.. మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే కాకుండా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు డిజిటల్ క్లాసులు ప్రారంభించడం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి పౌష్టికాహారం అందించే చర్యలు తీసుకోవడం ఎంతో మంచిదని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు… ఈ నేపథ్యంలో విద్యార్థులకు రాగిజావ అందించారు.. మంత్రం డిజిటల్ క్లాసులను ప్రారంభించారు…అలాగే రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలలను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ ఎక్కడి కక్కడ సోలార్ సిస్టంను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు… ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్.. ఎంఈఓ ఆంజనేయులు.. ఉపాధ్యాయులు.. విద్యార్థులు పాల్గొన్నారు..