ఏపీలో 16.82 లక్షల ఉచిత సిలిండర్ల బుకింగ్
ఏపీలో గత నెల 29న ప్రారంభమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి మంచి స్పందన లభిస్తోంది. నిన్నటి
వరకు 16.82 లక్షల మంది బుక్ చేసుకోగా, 6.46 లక్షల గ్యాస్ బండలు డెలివరీ అయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.97 కోట్లు జమైంది. ప్రస్తుతం మహిళలు డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకున్న తర్వాత 1-2 రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తోంది. త్వరలోనే పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.