SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 15 at 4.29.42 PM

సాక్షిత : * తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన *శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు మంజూరైన నిధులను చెక్కుల రూపేణ దేవాలయాల కమిటీ ప్రతినిధులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తో కలిసి పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా కన్నుల పండుగ వాతావరణం లో అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకున్నాం అని, అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యం తో నియోజకవర్గం లోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని ,బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేల  బోనాలు నిర్వహించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాని,ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల అంగరంగా వైభవంగ పండుగల జరుపుకునేల కృషి చేస్తున్నారు అని , ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రంగాలలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి కెసిఆర్  ముందుకు తీసుకెలుతున్నారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసి కన్నుల పండుగ వాతావరణం లో బోనాలు జరిగేలా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ అన్ని రకాల వసతులు కలిపిస్తూ ప్రశాంత వాతావరణం కలిపించామని, బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేలా చూశామని ప్రభుత్వ విప్ గాంధీ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,హఫీజ్పెట్
డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, బాలింగ్ యాదగిరి గౌడ్, ప్రసాద్ , హరినాథ్, రఘునాథ్, బాలరాజు, మోజేశ్, రాము, శ్రీనివాస్ గౌడ్ ,మల్లేష్ గౌడ్ ,భాను, రమేష్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS