Bolla Brahmanaidu, legislators, handed over the checks of the CM’s financial assistance fund
సాక్షిత : వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గ పరిధిలోని 41 మంది బాధితులకు వచ్చిన 31 లక్షల 87 వేల రూపాయల సీఎం ఆర్ధిక సహాయ నిధి చెక్కులను వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా భాదితులకు అందజేశారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమత లేని పేదలను ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరిగింది అన్నారు. ఆరోగ్య శ్రీ అనుమతులు ఉన్న వైద్యశాలలోనే చికిత్స చేయించుకోవాలని అన్నారు.
చాలా రకాల వ్యాధులను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పధకంలో చేర్చడం జరిగిందని, అన్ని వైద్య సౌకర్యాలు, ఆయా విభాగాల్లో నిపుణులు ఉన్నటువంటి ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ అనుమతులు ప్రభుత్వం కల్పించిందని ప్రజలు గమనించి ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ఆసుపత్రిలో చికిత్సను పొందవలసినదిగా కోరారు.
ఆరోగ్యశ్రీ ఉండి కూడా ఆసుపత్రి యాజమాన్యం వారు నగదును డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని కోరారు. అలాగే బాధితులతో మాట్లాడుతూ వారి ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులు, యోగక్షేమాలను శాసన సభ్యుల వారు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యాక్రమంలో అన్ని మండలాల, పట్టణ కన్వీనర్లు, ZPTCలు, MPPలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, Vice-MPPలు, సర్పంచులు, MPTCలు, అన్ని వార్డుల కౌన్సిలర్లు, మరియు వినుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు