ఆదిపరాశక్తి లక్ష్మీదేవమ్మ మారమ్మ తల్లి ఉత్సవాలు
చిట్యాల సాక్షిత
శ్రీ ఆదిపరాశక్తి లక్ష్మీదేవమ్మ మారమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం, బొడ్రాయి (నాభిశిల) సప్తమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకులు రాగిచెడు జయంత్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకుల బృందం వావిలాల ప్రభాకరశర్మ, దుర్గాప్రసాద్, వావిలాల రవికుమార్ శర్మలు ఆలయంలో మంటపపూజలు, హోమములు, గర్తసంస్కారము, అమ్మవార్లకు, బొడ్రాయి, పోతరాజు విగ్రహాలకు పంచామృత, శుద్దోదక, ఫలోధక స్నానములు, కూష్మాండ బలి ప్రధానం కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామంలోని మహిళలు బొడ్రాయికి జలాభిషేకం చేశారు. రాత్రికి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా మైలలు తీయబడును. ఈ కార్యక్రమాలకు డిసిసిబి వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, మాజీ సింగిల్విండో చైర్మన్ రాచకొండ కిష్టయ్యలు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం, పూజ కార్యకమాలలో సర్పంచ్ రత్నం పుష్పమ్మ నరసింహ, ఎంపీటీసీ సభ్యులు దుబ్బ పద్మ కుమారస్వామి, సింగిల్విండో డైరెక్టర్ దోర్నాల రామచంద్రం కవిత, వార్డు సభ్యుడు గోపగోని నర్సింహా, కోఆప్షన్ సభ్యుడు కొయగూర శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ నార్సింగ్ వెంకటేశం, పానుగుల్ల వెంకటేశం, కొయగూర వెంకటేశం, బొడిగె విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.