Bless the world that lives for people
ప్రజల కోసం తపించే జగనన్నని ఆశీర్వదించండి – ఎమ్మెల్యే భూమన
సాక్షిత తిరుపతి : ప్రజల అభివృద్ది కోసం నిరంతరం తపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుతూ తిరుపతి 24వ డివిజన్ ఇందిరానగర్ లో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇందిరానగర్ లో మంగళవారం భూమన పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడక ముందు నుండి తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే పనిలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆయన తెలిపారు.
భారత దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పేద, బడుగు ప్రజల కుటుంబాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలోని దాదాపు ప్రతి ఇంటిలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ఏదో ఒక పథకంలోనైనా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు.
ప్రజల బాగు కోసం పనిచేసే ముఖ్య మంత్రిని ఆదరించి, ఆశీర్వదించాలని భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అభ్యర్థించారు. ఇందిరానగర్ లో పర్యటిస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ, ఆ సమస్యలను అధికారులకు చెబుతూ, త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కార్పొరేటర్ హనుమంత్ నాయక్, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహాచారి, తిరుపతి మునిరామిరెడ్డి, ఇందిరానగర్ వైసిపి నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, గంగులమ్మ, నారాయణరెడ్డి, సునీల్ యాదవ్, గౌరీ, రాజు, సాయి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.