Bleaching powder should be mixed in appropriate quantity in Mission Bhagiratha drinking water
మిషన్ భగీరథ త్రాగునీటిలో తగిన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని కుక్కింద గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 11:30 AM వరకు పర్యటించారు.
గ్రామంలో పాడుబడ్డ ఇళ్లను మరియు పిచ్చిమొక్కలను తొలగించాలని, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
కుక్కింద గ్రామంలో అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు, గ్రామంలో మరియు పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను మంజూరు చేయాలని, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ (NCD) షుగర్, బీపీ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
గ్రామంలో 6వ వార్డులో నల్లా కనెక్షన్ లేని ఇళ్లకు నల్లా కలెక్షన్లు ఇవ్వాలని, మిషన్ భగీరథ త్రాగునీటిలో ట్యాంకు నిండినప్పుడు బ్లీచింగ్ పౌడర్ కలిపేలా… చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.