బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన అంశాలు….
లిక్కర్ స్కాంలో తన కుటుంబ పాత్ర పై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ శాంతి భద్రతలకు భంగం కలిగించే కుట్రకు తెర దీశారు.
శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే శాంతి భద్రతల సమస్యను సృష్టించడం సిగ్గు చేటు.
ఎంఐఎం, టీఆరెస్ కలిసి మత విద్వేషాలు రెచ్చ గొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి.
పాతబస్తీ అభివృద్ధి కాకపోవడానికి ఈ రెండు పార్టీలే కారణం.
పాతబస్తీ అభివృద్ధి అయితే సంఘ విద్రోహ శక్తులకు స్థానం ఉండదు.
ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బీజేపీ చెప్పే విషయాలపై ముస్లిం సమాజం కూడా ఆలోచిస్తోంది.
పాదయాత్ర తో టీఆరెస్, ఎంఐఎం పీఠాలు కదిలి పోతున్నాయి.
ఈ విషయం తెలిసి పాదయాత్రను అడ్డుకునే కుట్ర చేస్తున్నారు.
టిఆర్ఎస్, ఎంఐఎం కలిసి మత విద్వేషాలు సృష్టిస్తూ బీజేపీపై నెపం మోపే కుట్ర చేస్తున్నాయి.
ఈ కుట్ర వెనుక కేసీఆర్ పాత్ర ఉంది.
గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించాలని ప్రజలను కోరుతున్నా.
టీఆరెస్, ఎంఐఎం కుట్రలో ప్రజలు భాగస్వాములు కావొద్దు.
మేధావులు, ప్రజలు ఈ నిర్బంధాలను, కుట్రలను గమనించాలి.
అందరూ తెలంగాణను శ్రీలంక లా ఊహించు కుంటున్నాడు
సీతమ్మను, హిందూ దేవతలను కించపర్చిన మూర్ఖుడు మునావర్ ఫారూఖ్ ను ఆహ్వానించే విషయంలో కేసీఆర్ కొడుకు పాత్ర ఉంది..