SAKSHITHA NEWS

మహిళ రెజ్లర్లు పై లైంగిక వేధింపులకు పాల్పడిన బి.జె.పి. యం.పి. బ్రిజ్ భూషణను అరెస్టు చేయాలని, పదవులనుండి బర్తరఫ్ చేయాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కే. నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వుపాధ్యక్షులు అల్లు.మహాలక్ష్మి డిమాండ్ చేశారు.మహిళా రెజ్లర్ల నిరసనపై నూతన పార్లమెంట్ ప్రారంభం రోజు మే 28 న మోడీ ప్రభుత్వం చేసిన దాడికి ,అరెస్టులకు నిరసనగా కార్మిక సంఘాలు జూన్1న నిరసన తెలియజేయాలన్న అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో బాగంగా శ్రీకాకుళం 7రోడ్ల జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవం, న్యాయం కోసం పోరాడుతున్న మహిళా రెజ్లర్లుకు ప్రజలంతా సంఘీభావాన్ని తెలియచేయాలని పిలుపునిచ్చారు. దేశానికి అవార్డులు తెచ్చిపెట్టిన, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన భారత స్టార్ మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపులు ఫిర్యాదును నమోదు చేయకుండా పోలీసులు తిరస్కరించారు.అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలని,నిరసన ప్రదేశంలో విద్యుత్తును తక్షణమే పునరుద్ధరించాలని, తాగునీరు, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు.సత్యనారాయణ వివిధ సంఘాల నాయకులు కె. ఆదిలక్ష్మీ, యస్.దుర్గా, స్వాతి, చీపురు.లక్ష్మీ, అమ్మాజీ,జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS