కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్
అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా ప్రశ్నించే గొంతులను నొక్కి వేయడం ప్రజలకు సరైన భరోసా కల్పించలేని కెసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు అనే వాడు ఉండకూడదని సంకల్పించుకున్నారేమో ఆరు నెలల దాకా బయటికి వెళ్ళడు బయటకు వెళ్తే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు బయట ఉండకూడదు
ప్రధానంగా బిజెపి నాయకులు టార్గెట్గా పనిచేస్తున్న కెసిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. కెసిఆర్ మెదక్ వెళ్తున్న సందర్బంగా వెళ్లే దారిలో ఉన్న బీజేపీ నాయకులు కౌన్సిలర్ భర్త పీసరి కృష్ణారెడ్డి అక్రమ అరెస్ట్
బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ఇచ్చిన హామీలు పేదలకు డబల్ బెడ్ రూమ్లు,దళిత బందు పది లక్షలు,బీసీలకు లక్ష రూపాయలు,గృహలక్ష్మి 5-3లక్షలు నిరుద్యోగులకు 3వేల భృతి అమలు చేయడం చేతకాదు మరియు పేదలు అవస్థలు పడుతుంటే పట్టించుకునే దిక్కు ఉండదు పైగా కెసిఆర్ అధికంగా పెంచిన ఇంటి పన్నులు,నల్లబిల్లులు,కరెంట్ బిల్లులు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై ప్రత్యేక స్టేట్ టాక్స్లు,వేసి ప్రజలను పీడించవచ్చు కానీ ప్రశ్నించే వారు అడిగేవారు ఉండకూడదు అనే ధోరణి కెసిఆర్ కు తగదు ఇలాంటి ధోరణి అవలంబిస్తున్న కేసీఆర్ తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నరని అతి త్వరలో నీకు తగిన బుద్ధి చెప్పి శాశ్వతంగా నీ ఫామ్ హౌస్ లో పండబెడతారని హెచ్చరించారు