చిట్యాల సాక్షిత దినపత్రిక
కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం వైపు అడుగులు వేస్తూ భారత దేశ అభివృద్ధికి అహర్నిశలు పాటు పడుతున్నారని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు అన్నారు. చిట్యాల మండలం ఉరుమండ్ల గ్రామంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు వాడ వాడల ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రధాని నరేంద్ర మోడీ విజయాలను తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి గాను 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి ప్రధానమంత్రి కి మద్దతు తెలుపండి అని ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పాలనలో ప్రవేశపెట్టిన అన్ని పథకాల గూర్చి ఇంటింటికీ బిజెపి ప్రచారంలో భాగంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం పలు పథకాల కింద దేశంలోని రాష్ట్రాలకి అందిస్తున్న నిధులను గూర్చి వివరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నకిరేకల్ ఎస్సీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, మీడియా సెల్ కన్వీనర్ ఉయ్యాల లింగస్వామి గౌడ్, ఎస్సీ మోర్చా చిట్యాల మండల అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, యాదయ్య, శ్రీను, మల్లేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు