SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 27 at 7.02.20 PM

*వరద ముంపు బాధితులను ఆదుకోవాలి..

*వరద ముంపు నివారణకు శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలి..

అకాల వర్షాలతో జమ్మికుంట పట్టణంలో వరద నీరు చేరిన హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీలను బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట ప్రాంతంలో హౌసింగ్ బోర్డు , అంబేద్కర్ కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయని, వరద నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో వస్తువులన్నీ నీట మునిగిపోయాయని, ప్రజలు జీవించలేని దయనీయ పరిస్థితి ఉందన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ అంబేద్కర్ కాలనీ ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ద్వారా తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.,

జిల్లా కలెక్టర్ కు ఇక్కడి సమస్యను ఫోన్ ద్వారా వివరించి ప్రజలకు తగిన సహాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీ ల లో ప్రణాళిక లేకుండా చేపట్టిన మురికి కాలవ నిర్మాణాల ద్వారా వరద నీరు అధికంగా ఇళ్లలోకి వచ్చినట్లు స్పష్టంగా కనబడుతుందన్నారు. ఇక్కడి ప్రాంతాల్లో వరద నీరు రాకుండా అధికారులు సమగ్ర ప్రణాళికతో తగిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో వరద నీరు నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.


జమ్మికుంట బిజెపి పట్టణ అధ్యక్షుడు మల్లేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, బిజెపి obc మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జిల్లా సుధాకర్, ప్రధాన కార్యదర్శులు పల్లెపు రవి, మోత స్వామి, మోడెం రాజు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS