SAKSHITHA NEWS

3లక్షల ఆర్థికసాయం అందజేత

  • టీడీపీ అధికారంలోకి వచ్చాక బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఇల్లు

  • సాక్షిత : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, పెరుమల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ కార్యకర్త మైలేపల్లి పైడియ్య(50సం.లు) 2023 అక్టోబర్ 2న మరణించాడు. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. పైడియ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. పైడియ్య కుమారుడు రాంబాబు, కోడలు భారతితో భువనేశ్వరి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని వారు వాపోయారు. టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పైడియ్య టీడీపీ జెండాను తప్ప మరే ఇతర జెండా పట్టలేదని వివరించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రూ.3లక్షల చెక్కును ఇచ్చి ఆర్థిక సాయం అందించారు. పైడియ్య కుమారుడు తమ ఇల్లు పాడైపోయిందని, కొత్త ఇల్లు కట్టించుకునేందుకు సాయమందించాలని భువనేశ్వరిని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ప్రభుత్వ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెర్లం మండలం కార్యకర్తలు పెద్దఎత్తున పైడియ్య ఇంటి వద్దకు చేరుకుని భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ప్రెస్ రిలీజ్:-

అప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ

  • రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థిక సాయం

బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, మోదుగువలస పంచాయతీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా నిలిచారు. తాము అభిమానించే నేతకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో 2023 సెప్టెంబర్ 9న మరణించడం బాధాకరమన్నారు. అప్పారావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని అప్పారావు కుటుంబానికి తెలిపారు. అప్పారావు భార్య పైడాలమ్మ, కుమారులు సత్యనారాయణ, రామారావు, నాయుడు, కుటుంబ సభ్యులు సీహెచ్ సింహాచలం భువనమ్మతో మాట్లాడుతూ…తమ తండ్రి 1983 నుండి టీడీపీ కార్యకర్తగానే కొనసాగి కన్నుమూశారని తెలిపారు. తాము కూడా ఊహ తెలిసిన నాటి నుండి పార్టీకి విధేయులుగా ఉన్నామని వివరించారు. వైసీపీ మూకలు తమను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాయని, ఆటుపోటులను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నామన్నారు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు మరింత కృషి చేయాలని భువనమ్మ కోరారు. వృద్దాప్యంలో భర్తను కోల్పోయిన పైడాలమ్మకు రూ.3లక్షల చెక్కును అందించి మీకు మేమున్నాం..ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు.

Whatsapp Image 2024 01 04 At 2.25.24 Pm

SAKSHITHA NEWS