SAKSHITHA NEWS

భక్తవర వీరాంజనేయ స్వామి ప్రాంగణంలోని శివాలయ ఐదవ వార్షికోత్సవంలో పాల్గొని నీలకంఠుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

128 – చింతల్ డివిజన్ న్యూ లాల్ బహదూర్ నగర్ లోని “భక్తవర వీరాంజనేయ స్వామి ప్రాంగణంలో మహా శివలింగాన్ని ప్రతిష్టించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ఆ నీలకంఠుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రిసత్యనారాయణ, హేమలత సురేష్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, టెంపుల్ కమిటీ చైర్మన్ జగన్ గౌడ్, వార్షికోత్సవ నిర్వాహకులు పబ్బి శ్రీనివాస్ నాయి , కాలనీ వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ గుప్తా, కోశాధికారి బాలస్వామి గౌడ్, సీనియర్ నాయకులు బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app