Bhagiratha drinking water is an ambitious mission undertaken by the government
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ త్రాగునీరు ప్రతి ఇంటికి అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 12:00 NOON వరకు పర్యటించారు.
గ్రామంలో అండర్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేద్దాం అన్నారు.
గ్రామంలో పిచ్చి మొక్కలు, పాడు బడ్డ ఇండ్లును తొలగించాలని, పల్లె ప్రగతిలో చేయలేని పెండింగ్ పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు గ్రామాన్ని శానిటేషన్ చేస్తూ… గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
గ్రామంలోని 1,4,9వ వార్డులలో ప్రజలకు సరిపడా నీటిని అందించాలని, అందుకు గేట్ వాల్వ్ ఏర్పాటు చేయాలని, త్రాగునీటి ట్యాంక్ నిండిన ప్రతి సారి తగిన మొతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
గ్రామంలో అవసరమైన చోట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు, గ్రామంలో మరియు పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
గ్రామంలో ANM ప్రతి ఇంటికి వెళుతూ… బీపీ, షుగర్ పరీక్షించాలన్నారు, బీపీ షుగర్ ఉన్న వ్యక్తులకు తగిన మాత్రలు ఇవ్వాలన్నారు.
గ్రామంలో మరుగుదొడ్డి నిర్మించుకొని వారు… ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు.
అనంతరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు మంజూరైన కల్యాణలక్ష్మి / షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.