ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మహిళలకు మెరుగైన సేవలు అందించాలి.
-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మహిళలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్య మహిళ కు సంబంధించి చేపడుతున్న సేవల ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య మహిళ కేసులు పెరగాలని, ఈ దిశగా మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి రెఫరల్ కేసుల సంఖ్య పెరగాలన్నారు. మెమో థెరపీ కేసులు రోజుకు కనీసం 50 చేపట్టాలన్నారు. 35 సంవత్సరాలు దాటిన మహిళలందరికి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధ స్క్రీనింగ్ చేయాలని, ఈ దిశగా మహిళలందరికి బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించాలని అన్నారు. ఒకసారి డిటెక్ట్ అయ్యాక కాకుండా ముందే స్క్రీనింగ్ చేస్తే, నార్మల్ లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ముందుగానే తెలుసుకొని, నియంత్రణ చేయవచ్చన్నారు. రెఫరల్ కేసులను 102 లో తీసుకొని రావాలని, ఆరోగ్య మహిళ కేంద్ర స్టాఫ్ నర్సులు, సిబ్బంది అట్టి కేసులను ఫాలో అప్ చేయాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, ఆసుపత్రి పర్యవేక్షకులు డా. వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.