SAKSHITHA NEWS

డ్రోన్ కెమెరాలతో మెరుగైన పోలీసు సేవలందించుటయే ధ్యేయం… జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…

డ్రోన్స్ ఉపయోగించి చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై రియల్ టైం నిఘా

సామాజిక బాధ్యత, స్పూర్తితో పోలీస్ శాఖకు హై-టెక్ డ్రోన్ ను బహుకరించిన కందుల ఓబుల్ రెడ్డి హాస్పిటల్..

మార్కాపురం సర్కిల్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు ట్రాఫిక్ నియంత్రణ, విపత్తు నిర్వహణ ఇతర పోలీసింగ్ అవసరాల కొరకు మార్కాపురంలోని కందుల ఓబుల్ రెడ్డి హాస్పిటల్ చైర్మన్ డా. కందుల గౌతమ్ నాగిరెడ్డి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ కి అత్యాధునిక సాంకేతికత కూడిన DJI Air3s డ్రోన్ ను అందజేశారు.


SAKSHITHA NEWS